తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ) గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఎంప్లాయిస్ యూనియన్ (ఈయూ) రాష్ట్ర స్థాయిలో విజయం సాధించింది. మొత్తం 34,904 మంది ఓటర్లకు గాను 34,421 ఓట్లు పోలయ్యాయి.

ఈ ఎన్నికల్లో తొమ్మిది కార్మిక సంఘాలు పోటీ చేయగా, ఈయూ అత్యధికంగా 18,276 ఓట్లు సాధించి రాష్ట్ర స్థాయి గుర్తింపు సంఘంగా నిలిచింది. ఈ గుర్తింపు సెప్టెంబర్ 1 నుంచి రెండేళ్ల పాటు అమలులో ఉంటుంది.

అయితే, రీజియన్ల వారీగా చూస్తే తెలంగాణ వర్కర్స్ యూనియన్ (టీడబ్ల్యూయూ) కూటమి మెజార్టీ స్థానాలను గెలుచుకుంది. మొత్తం 14 రీజియన్లలో 9 రీజియన్లలో టీడబ్ల్యూయూ కూటమి విజయం సాధించింది.

ఖమ్మం, నల్గొండ, మెదక్, మహబూబ్ నగర్, వరంగల్, రంగారెడ్డి, కరీంనగర్ రీజియన్లతో పాటు హైదరాబాద్, బస్ భవన్ రీజియన్లలో టీడబ్ల్యూయూ కూటమి గెలిచింది.