ఎల్ నినో ప్రభావంతో అడవుల్లో నీటి కష్టాలు సీజన్ కు ముందే ప్రారంభమయ్యాయి. సాధారణంగా అక్టోబర్ నెలలో వర్షాలు తగ్గి చలిగాలులు మొదలవుతాయి, కానీ ఈసారి ఎండలు తీవ్రంగా ఉన్నాయి.
గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 నుంచి 4 డిగ్రీలు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఈసారి తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో జలవనరులు క్రమంగా అడుగంటుతున్నాయి.
ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో పగటి ఉష్ణోగ్రతలు 30 డిగ్రీలు దాటుతున్నాయి. దీనివల్ల అడవుల్లో పచ్చిక ఎండిపోతోంది.
అడవుల్లోని కుంటలు, వాగులు, చెక్ డ్యాంలు అడుగంటుతున్నాయి. పచ్చిక లేక వన్యప్రాణులు ఆకలితో, దాహంతో అలమటిస్తున్నాయి.
నగరాల్లో పావురాలు, పల్లెల్లో కోతులు నీటి కోసం తండ్లాడుతున్నాయి. అక్టోబర్ లోనూ ఎండలు దంచికొడుతుండటంతో పరిస్థితి మరింత తీవ్రమవుతోంది.

