పశ్చిమ ఆసియాలో పెరుగుతున్న రాజకీయ ఉద్రిక్తతలు, ముడి చమురు ధరలు బ్యారెల్‌కు 110 డాలర్లకు చేరువ కావడంతో రూపాయి విలువలో మార్పులు వచ్చాయి. ఈ పరిణామాలు భారత మార్కెట్లలో బంగారం, వెండి ధరలపై ప్రభావం చూపాయి.

పండుగ సీజన్, నవరాత్రుల వేళ భారత మార్కెట్లలో బంగారం, వెండి ధరలు దిగివస్తుండటం పెట్టుబడిదారులకు ఊరటనిస్తోంది. గత పది రోజుల్లోనే తులం బంగారంపై రూ.3,770 వరకు తగ్గింది.

బంగారం, వెండి ధరల్లో మార్పులు కొనసాగుతున్న తరుణంలో భారతీయ ఇన్వెస్టర్ల కొనుగోలు విధానంలో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. సంప్రదాయ ఆభరణాల కొనుగోలు అలవాటు నుంచి ప్రజలు ఇప్పుడు ప్రత్యామ్నాయ మార్గాల వైపు ఆసక్తి చూపుతున్నారు.

ముఖ్యంగా గోల్డ్ ఈటీఎఫ్‌లు, డిజిటల్ గోల్డ్‌లలో పెట్టుబడులు పెట్టేందుకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇది భౌతిక బంగారం కొనుగోలుకు బదులుగా డిజిటల్ రూపంలో పెట్టుబడులు పెట్టే ధోరణిని సూచిస్తోంది.