మెడికవర్ హాస్పిటల్స్ ప్రతిష్టకు భంగం కలిగించే కథనాలను ప్రసారం చేయకూడదని తెలంగాణ హైకోర్టు అక్టోబర్ 16న ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే ప్రచురించిన కథనాలను తిరిగి ప్రచురించవద్దని స్పష్టం చేసింది.
సహృదయ హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ (మెడికవర్ హాస్పిటల్స్) దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ కృష్ణాంక్, జస్టిస్ హరీష్ రెడ్డిలతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది.
మెడికవర్ హాస్పిటల్స్‌కు వ్యతిరేకంగా పరువు నష్టం కలిగించే కథనాలను ప్రసారం చేయకుండా ఆంక్షలు విధిస్తూ హైకోర్టు ఈ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది.
విచారణ పూర్తయి తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు లేదా ప్రతివాదులు తమ వాదనలు వినిపించే వరకు ఈ ఆంక్షలు అమలులో ఉంటాయని ధర్మాసనం స్పష్టం చేసింది.
ఈ ఆదేశాలు అక్టోబర్ 16న జారీ అయ్యాయి.



