మెడికవర్ ఆసుపత్రి ప్రతిష్ఠను దెబ్బతీసే కథనాలను ప్రసారం చేయకూడదని తెలంగాణ హైకోర్టు అక్టోబర్ 16న ఆదేశించింది. సహృదయ హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ (మెడికవర్ హాస్పిటల్స్) దాఖలు చేసిన పిటిషన్పై న్యాయస్థానం ఈ ఉత్తర్వులు జారీ చేసింది.
ప్రస్తుతం ప్రసారమైన కథనాలను తిరిగి ప్రసారం చేయవద్దని కూడా హైకోర్టు స్పష్టం చేసింది. న్యాయమూర్తులు జస్టిస్ కృష్ణాంక్, జస్టిస్ హరీష్ రెడ్డిలతో కూడిన ధర్మాసనం ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది.
మెడికవర్ ఆసుపత్రికి వ్యతిరేకంగా ఎలాంటి అభ్యంతరకర కథనాలను ప్రసారం చేయకుండా ఆంక్షలు విధించింది. ఈ ఆంక్షలు తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు లేదా ప్రతివాదులు తమ వాదనలు వినిపించే వరకు అమలులో ఉంటాయని ధర్మాసనం పేర్కొంది.
ఈ కేసులో తదుపరి విచారణ పూర్తయ్యే వరకు మెడికవర్ ఆసుపత్రిపై ఎలాంటి ప్రతికూల ప్రచారానికి పాల్పడవద్దని హైకోర్టు ఆదేశించింది. ఆసుపత్రి ప్రతిష్ఠను కాపాడేందుకు ఈ చర్యలు తీసుకుంది.



