గత మూడేళ్లుగా హైదరాబాద్‌ రియల్‌ ఎస్టేట్‌ రంగంలో దసరా సందడి కనిపించడం లేదు. సాధారణంగా పండుగ రోజున సొంతింట్లో అడుగు పెట్టేవారు, భూమి పూజ చేసుకునేవారు, కొత్తగా స్లాబ్‌ పనులు చేసేవారు ఉంటారు. కానీ ఈసారి ఆ హడావుడి లేదు.

రియల్‌ ఎస్టేట్‌ లావాదేవీలు గత ఆరు నెలలుగా పడిపోయాయి. కొత్త రెసిడెన్షియల్‌ ప్రాజెక్టులకు భూమి పూజ చేయడానికి వ్యాపారులు ఆసక్తి చూపడం లేదు.

కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రియల్‌ ఎస్టేట్‌ రంగం సంక్షోభంలో ఉంది. అమ్మకాలు లేక వ్యాపారం దివాళా తీసే పరిస్థితికి చేరుకుంది.

ప్రభుత్వ చర్యలతో నగర రియల్‌ ఎస్టేట్‌ కోలుకోలేని స్థితికి చేరింది. దసరా రోజున ఏ కార్యం చేపట్టినా దిగ్విజయంగా పూర్తవుతుందనే సెంటిమెంట్‌కు ఈసారి బ్రేక్‌ పడింది.