భాగ్యనగరం అత్యంత వేగంగా విస్తరిస్తోంది. ఎత్తైన భవనాలు, ఐటీ కంపెనీలు, కొత్త నివాస ప్రాంతాలు నిరంతరం పెరుగుతున్నాయి. ఈ క్రమంలోనే హైదరాబాద్‌లో నీటి ఎద్దడి తీవ్రమైన సమస్యగా మారింది. నగరం, పరిసర ప్రాంతాల నీటి అవసరాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. అధికారులు అంచనా ప్రకారం, ప్రతిరోజూ సుమారు 735 మిలియన్ గ్యాలన్ల నీరు అవసరమని తెలుస్తోంది. ఈ పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చడం అధికారులకు పెద్ద సవాలుగా మారింది.