భారతీయ రైల్వే ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఒక కొత్త విధానాన్ని అమలులోకి తెస్తోంది. దీపావళి పండుగకు ముందే ఈ మార్పులు ప్రయాణికులకు అందుబాటులోకి వస్తాయి.
ఇప్పటివరకు ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ లేదా యాప్ ద్వారా టికెట్లు బుక్ చేసుకున్న వారికి మాత్రమే ప్రయాణ బీమా సౌకర్యం లభించేది.
తాజా నిర్ణయం ప్రకారం, రైల్వే రిజర్వేషన్ కౌంటర్లలో నేరుగా టికెట్లు కొనుగోలు చేసే ప్రయాణికులకు కూడా ఈ బీమా వర్తిస్తుంది.
పండుగల సమయంలో లక్షలాది మంది ప్రజలు రైళ్లలో ప్రయాణిస్తుంటారు. ఈ కొత్త సౌకర్యం వారికి మరింత భద్రతను అందిస్తుంది.



