సొంతింటి కోసం చూస్తున్నవారికి ఒకేచోట పలు ప్రాజెక్టులను చూపేందుకు నరెడ్కో తెలంగాణ 16వ ప్రాపర్టీ షో సిద్ధమవుతోంది. అక్టోబర్ 30 నుంచి నవంబర్ 1 వరకు హైదరాబాద్‌లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో ఈ ప్రదర్శన జరుగుతుంది.
అందుబాటు ధరల ఇళ్లు, అపార్ట్‌మెంట్లు, ప్లాట్లు, వాణిజ్య స్థలాలు ఈ ప్రదర్శనలో అందుబాటులో ఉంటాయి. నరెడ్కో తెలంగాణ అధ్యక్షుడు శ్రీధర్ రెడ్డి కొప్పుల గురువారం విలేకరుల సమావేశంలో ఈ వివరాలు వెల్లడించారు.
అనుమతులు ఉన్నవే కొనండి
ఈసారి ప్రదర్శనలో పారదర్శకతకు ప్రాధాన్యం ఇస్తామని కొప్పుల చెప్పారు. అవసరమైన అనుమతులు ఉన్న ప్రాజెక్టులనే ఎంచుకోవాలని కొనుగోలుదారులకు సూచించారు. ఇప్పటికే సుమారు 20 వేల మంది ఆన్‌లైన్‌లో రిజిస్టర్ చేసుకున్నారని తెలిపారు.
డిమాండ్‌కు కారణం
రీజినల్ రింగ్ రోడ్ (ఆర్ఆర్ఆర్) సహా హైదరాబాద్‌లో వేగంగా పెరుగుతున్న మౌలిక సదుపాయాలు ఇళ్లకు డిమాండ్ పెంచుతున్నాయని ఆయన అన్నారు.




