రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాలకు శుభవార్త. కుప్పం, శ్రీకాకుళంలో రెండు కొత్త గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టుల నిర్మాణానికి కేంద్ర పౌర విమానయాన శాఖ ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయంతో ఆంధ్రప్రదేశ్ ఏవియేషన్ రంగానికి భారీ ప్రోత్సాహం లభించనుంది. ఈ కొత్త ఎయిర్‌పోర్టుల నిర్మాణం వల్ల ఈ ప్రాంతాల ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయి.