హైదరాబాద్‌లో జన్మించిన ప్రముఖ పారిశ్రామికవేత్త ప్రేమ్ వత్సా ఐడీబీఐ బ్యాంక్‌ను కొనుగోలు చేయనున్నారు. జేబులో కేవలం ఎనిమిది డాలర్లతో కెనడాకు వెళ్లిన ఆయన ఇప్పుడు 52 వేల కోట్ల రూపాయల విలువైన బ్యాంకుకు యజమాని కానున్నారు.

ప్రేమ్ వత్సా 1970వ దశకంలో కెనడాకు వలస వెళ్లారు. అక్కడ ఆయన తన వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నారు.

ఆయనను కెనడా వారెన్ బఫెట్ అని పిలుస్తారు. ఆయనకు 100 బిలియన్ డాలర్ల విలువైన ఫెయిర్‌ఫాక్స్ ఫైనాన్షియల్ హోల్డింగ్స్ సంస్థ ఉంది.

ఫెయిర్‌ఫాక్స్ సంస్థ 1985లో ఒక చిన్న బీమా సంస్థగా ప్రారంభమైంది. ప్రేమ్ వత్సా వ్యాపార దక్షత, దూరదృష్టి, క్రమశిక్షణతో అది భారీ ఆర్థిక సంస్థగా ఎదిగింది.