గోదావరి జిల్లాల్లో పులస చేపలకు ఎప్పుడూ మంచి డిమాండ్ ఉంటుంది. జూన్ నెల తర్వాత గోదావరి నదికి వచ్చే వరద నీటిలో ఈ పులస చేపలు ఎదురీదుతూ కనిపిస్తాయి. వీటి రుచికి ఫిదా అయిన వారు ఎంత ధరైనా వెచ్చించి కొనుగోలు చేస్తుంటారు. గతంలో ఒక్కో పులస చేప ధర రూ.20 వేల నుంచి రూ.30 వేల వరకు పలికిన సందర్భాలు ఉన్నాయి. అయితే, ఈ ఏడాది పులసల లభ్యత చాలా తక్కువగా ఉంది.
ఈసారి గోదావరిలో పులస చేపలు చాలా తక్కువగా దొరకడంతో వాటి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. మొన్నటి వరకు ఒక్కో చేప రూ.20 వేలకుపైగా ధర పలికింది. డిమాండ్ ఉన్నా సరఫరా తక్కువగా ఉండటంతో ధరలు తగ్గడం లేదు. పులస ప్రియులు అధిక ధరలు వెచ్చించి కొనుగోలు చేయాల్సి వస్తోంది.



