ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో గత రెండు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. గత మూడు వారాలకు పైగా పొడి వాతావరణం నెలకొన్న తర్వాత ఈ వర్షాలు కురవడం ప్రజలకు, రైతులకు ఊరటనిచ్చింది. ప్రస్తుతం ఎల్‌నినో ప్రభావంతో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ వర్షాలు వ్యవసాయ పనులకు, తాగునీటి అవసరాలకు ప్రయోజనకరంగా మారనున్నాయి.

రాష్ట్రంలో ద్రోణి ప్రభావంతో ఈ వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కొద్దిపాటి వర్షం కూడా ఈ సమయంలో చాలా ప్రయోజనకరంగా ఉంటుందని వారు పేర్కొన్నారు. ఈ వర్షాల వల్ల భూగర్భ జలాలు పెరిగి, పంటలకు అవసరమైన నీరు అందుబాటులోకి వస్తుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేశారు.