అక్టోబర్ 17న తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ అంచనాలు చెబుతున్నాయి. ముఖ్యంగా దక్షిణ, తూర్పు తెలంగాణ జిల్లాలపై వర్ష ప్రభావం ఉంటుంది.
నల్గొండ, ఖమ్మం, నాగర్కర్నూల్ జిల్లాలకు వర్ష సూచన ఉంది. భద్రాద్రి కొత్తగూడెం, వనపర్తి, రంగారెడ్డి, యాదాద్రి జిల్లాల్లో కూడా వర్షాలు పడతాయి.
సూర్యాపేట జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లోనూ వర్షాలు కురుస్తాయి. ఈ జిల్లాల్లో మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడతాయి.
హైదరాబాద్లో అక్టోబర్ 17న అక్కడక్కడ వర్షాలు కురుస్తాయి. అక్టోబర్ 18న మరింత విస్తృతంగా వర్షాలు పడే అవకాశం ఉంది.
ప్రజలు మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు తెలిపారు.

