చెన్నై / హైదరాబాద్: ఎస్.ఎస్. రాజమౌళి, మహేష్ బాబు కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ప్రతిష్ఠాత్మక చిత్రం 'వారణాసి' విడుదల తేదీపై ట్రేడ్ వర్గాల్లో చర్చ కొనసాగుతోంది. ముందుగా ప్రకటించిన ఏప్రిల్ 7, 2027 నుంచి ఈ సినిమా వాయిదా పడే అవకాశముందన్న ఊహాగానాల నేపథ్యంలో, ఆ తేదీని దక్కించుకునేందుకు ఇతర చిత్రాలు ప్రయత్నిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
తాజాగా కోలీవుడ్ వర్గాల కథనాల ప్రకారం, శివకార్తికేయన్ కథానాయకుడిగా నటిస్తున్న 'సేయోన్' చిత్రం ఏప్రిల్ 7, 2027 స్లాట్‌పై కన్నేసినట్లు తెలుస్తోంది. 'వారణాసి' వాయిదా పడితే సమ్మర్ సెలవుల అడ్వాంటేజ్‌ను అందుకునేందుకు 'సేయోన్' బృందం సిద్ధంగా ఉన్నట్లు సినీ వర్గాల్లో టాక్ నడుస్తోంది.
'థాయ్ కిళవి' ఫేమ్ శివకుమార్ మురుగేశన్ దర్శకత్వం వహిస్తున్న 'సేయోన్'లో భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటిస్తున్నారు. కమల్ హాసన్, ఆర్. మహేంద్రన్ కలిసి రాజ్‌కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ పతాకంపై నిర్మిస్తుండగా, సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు.
కాగా, 'వారణాసి' వాయిదాపై గానీ, 'సేయోన్' విడుదల తేదీపై గానీ చిత్ర బృందాల నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ధ్రువీకరణ రాలేదు.



