హైదరాబాద్ / చెన్నై: సూపర్ స్టార్ రజనీకాంత్ కథానాయకుడిగా అశ్వత్ మారిముత్తు దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'ధర్మన్' చిత్రంలో టాలీవుడ్ హీరో రామ్ పోతినేని కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో ఆయన రజనీకాంత్ అల్లుడి పాత్రలో కనిపిస్తారని ఇప్పటికే వార్తలు వచ్చాయి.

అయితే తాజాగా సోషల్ మీడియాలో రామ్ పాత్రపై ఆసక్తికరమైన ప్రచారం జరుగుతోంది. ఆయన పాత్రకు ఊహించని ట్విస్ట్ ఉంటుందని, నెగెటివ్ లేదా డార్క్ షేడ్స్ ఉన్న సీరియల్ కిల్లర్ పాత్రలో రామ్ నటించే అవకాశం ఉందని ఆన్‌లైన్ వర్గాల్లో చర్చ సాగుతోంది.

రజనీకాంత్, రామ్ పాత్రల మధ్య 'క్యాట్ అండ్ మౌస్' తరహా ఉత్కంఠభరితమైన సన్నివేశాలు ఉంటాయని కూడా అభిమానులు ఊహిస్తున్నారు. అయితే ఈ పాత్ర స్వభావంపై 'ధర్మన్' చిత్రబృందం గానీ, రామ్ పోతినేని గానీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

మరోవైపు, రామ్ పోతినేని తన సోదరుడు కృష్ణ పోతినేని నిర్మాణంలో స్వీయ దర్శకత్వంలో 'వీర' అనే సైకలాజికల్ థ్రిల్లర్‌ను కూడా రూపొందిస్తున్నట్లు టాలీవుడ్ వర్గాలు పేర్కొంటున్నాయి.