ఈ ఏడాది సూపర్ ఎల్ నినో ప్రభావం కారణంగా శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి నీటి విడుదల నిలిపివేస్తున్నట్లు ప్రాజెక్ట్ ఎస్ఈ జగదీశ్వర్ అక్టోబర్ 20న తెలిపారు.
ప్రాజెక్టులో తగినంత నీటి నిల్వలు లేనప్పటికీ, ఆయకట్టు పరిధిలో సాగు చేస్తున్న పంటలను కాపాడేందుకు ఒక తడికి సాగునీరు అందించాలని ముఖ్యమంత్రి, సాగునీటి శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించారు.
ఈ ఆదేశాల మేరకు, అక్టోబర్ 10 నుండి అక్టోబర్ 20 ఉదయం 9:30 గంటల వరకు 9 టీఎంసీల సాగునీరు విడుదల చేశారు.
కాకతీయ, సరస్వతి, లక్ష్మీ, వరద కాలువలతో పాటు అలీ సాగర్ గుత్ప లిఫ్ట్ ఇరిగేషన్ పథకాల ద్వారా ఈ నీటిని అందించినట్లు ఎస్ఈ జగదీశ్వర్ వివరించారు.

