తెలంగాణలోని 13 జిల్లాలకు అక్టోబర్ 22 వరకు విస్తారంగా వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ప్రకటించింది. హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
శనివారం ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయి.
అలాగే మహబూబ్నగర్, నాగర్కర్నూల్, వనపర్తి, నారాయణపేట జిల్లాల్లో కూడా వర్షాలు పడతాయి. ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
దక్షిణాది రాష్ట్రాలతో పాటు పలు ప్రాంతాల్లో అక్టోబర్ 22 వరకు వర్షాలు కొనసాగుతాయని ఐఎండీ తెలిపింది. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.

