తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో ఎల్ నినో ప్రభావం, దాని పర్యవసానాలపై సమీక్షించేందుకు ఒక మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క్ ఈ కమిటీకి అధ్యక్షత వహిస్తారు. మంత్రులు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క, తుమ్మల నాగేశ్వరరావు, వాకిటి శ్రీహరిలను సభ్యులుగా నియమించారు. సీఎం సలహాదారు రామకృష్ణారావును ప్రత్యేక ఆహ్వానితుడిగా చేర్చారు.
ఈ ఉపసంఘం రాష్ట్రంలో ఎల్ నినో, కరువు పరిస్థితులపై సమీక్షించి తగిన చర్యలను సూచిస్తుంది. ప్రణాళిక శాఖ కార్యదర్శి ఈ సబ్-కమిటీకి కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ఉత్తర్వులు జారీ చేశారు.

