హైదరాబాద్‌కు మరో పెద్ద అంతర్జాతీయ కేంద్రం బలం చేకూరుతోంది. అమెరికాలోని అతిపెద్ద ఆర్థిక సేవల సంస్థల్లో ఒకటైన ట్రూయిస్ట్, హైదరాబాద్‌లో ఏర్పాటు చేస్తున్న AI ఆధారిత గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ (జీసీసీ) కోసం ఇన్ఫోసిస్‌తో తన భాగస్వామ్యాన్ని విస్తరించింది.
ఈ కేంద్రంలో వెయ్యి మందికి పైగా ఉద్యోగులు చేరనున్నారు. ఈ సందర్భాన్ని ఈ నెలాఖరులో ఘనంగా జరుపుకోనున్నారు.
ఈ కేంద్రం ఏం చేస్తుంది?
AI, టెక్నాలజీ, డేటా, ఇంజినీరింగ్, బ్యాంకింగ్ కార్యకలాపాలన్నీ ఈ ఒక్క కేంద్రం నుంచే నడుస్తాయి. కేంద్రాన్ని నిర్మించి, విస్తరించి, ఆ తర్వాత పూర్తిగా ట్రూయిస్ట్ సొంతంగా నడుపుకునేలా అప్పగించే బాధ్యతను ఇన్ఫోసిస్ తీసుకుంది.
పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు
మింట్ పత్రిక కథనం ప్రకారం, ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసి నడపడానికి ట్రూయిస్ట్ నుంచి ఇన్ఫోసిస్ 2026 మార్చిలోనే 50 కోట్ల డాలర్లకు పైగా విలువైన ఒప్పందం దక్కించుకుంది. ఈ కేంద్రంలో కనీసం 4,500 మంది పనిచేస్తారని, మొదటి ఏడాదిలోనే దాదాపు 2,000 మందిని ఇన్ఫోసిస్ నియమించుకోనుందని ఆ కథనం పేర్కొంది.
భారత్‌లో సాంకేతిక బృందాలను ఏర్పాటు చేస్తున్న అంతర్జాతీయ బ్యాంకులకు హైదరాబాద్ ఎంత ముఖ్యమైన నగరంగా మారుతోందో ఇది మరోసారి చూపిస్తోంది.




