హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే విజయ డయాగ్నస్టిక్ సెంటర్ 2026–27 రెండో త్రైమాసికం (జూలై–సెప్టెంబర్) ఫలితాలను మంగళవారం ప్రకటించింది.
ఫలితాలు (కన్సాలిడేటెడ్)
- ఆదాయం: ₹255.4 కోట్లు; గత ఏడాది ఇదే కాలంలో ₹201.6 కోట్లు (26.7% వృద్ధి)
- నికర లాభం: ₹59.47 కోట్లు; గత ఏడాది ₹43.28 కోట్లు (37.4% వృద్ధి)
- ఎబిటా: ₹112.8 కోట్లు (37.8% వృద్ధి); మార్జిన్ 44.1%
- ఆరు నెలల్లో (ఏప్రిల్–సెప్టెంబర్) ఆదాయం ₹486.4 కోట్లు, లాభం ₹112.6 కోట్లు
పరీక్షలు, విస్తరణ
ఈ త్రైమాసికంలో 49.8 లక్షల పరీక్షలు (16.5% వృద్ధి) చేయగా, 13.7 లక్షల మంది కేంద్రాలకు వచ్చారు (14.5% వృద్ధి). ఒక్కో పరీక్షకు సగటు ఆదాయం ₹513. తొలి అర్ధ సంవత్సరంలో 2 హబ్‌లు, 7 స్పోక్ కేంద్రాలు ప్రారంభించగా, రెండో అర్ధ సంవత్సరంలో మరో 3 హబ్‌లు, 7 స్పోక్‌లు తెరవాలని కంపెనీ ప్రణాళిక. గువాహటిలోని ఆర్య వెల్‌నెస్ సెంటర్ కొనుగోలుకు ఒప్పందం కుదిరింది; విలువ వెల్లడించలేదు.
పాత కేంద్రాల్లో సుమారు 20% వృద్ధి వచ్చిందని, కొత్త కేంద్రాలు వేగంగా నిలదొక్కుకుంటున్నాయని ఎండీ, సీఈవో సుప్రితా రెడ్డి తెలిపారు.




