హత్నూరలో అక్టోబర్ 19న మిషన్ భగీరథ మంజీరా తాగునీటి ప్రధాన పైప్లైన్ పగిలింది. దీని కారణంగా గ్రామాలకు సరఫరా అయ్యే తాగునీరు వృథాగా పోతోంది.
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంటింటికీ తాగునీరందించేందుకు మిషన్ భగీరథ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా ప్రారంభించారు. ఈ పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా గ్రామాలకు తాగునీరు సరఫరా అవుతోంది.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మిషన్ భగీరథ పైప్లైన్ల నిర్వహణపై నిర్లక్ష్యం చూపుతోందని ప్రజలు ఆరోపిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి ఘటనలు తరచుగా జరుగుతున్నాయి.
పైప్లైన్లు పదేపదే పగిలిపోవడంతో తాగునీరు వృథా అవుతోంది. అధికారులు, కాంట్రాక్టర్ల పర్యవేక్షణ లోపం వల్లే ఇలా జరుగుతోందని ప్రజలు మండిపడుతున్నారు.




