శాన్ ఫ్రాన్సిస్కో: అమెరికా టెక్ రంగంలో 23 ఏళ్ల ప్రవాస భారతీయ యువకుడు యశ్ పాటిల్ సరికొత్త రికార్డు సృష్టించారు. ఆయన సహ వ్యవస్థాపకుడిగా ఉన్న 'అప్లైడ్ కంప్యూట్' (Applied Compute) అనే AI సంస్థను ప్రముఖ సైబర్ సెక్యూరిటీ దిగ్గజం పాలో ఆల్టో నెట్వర్క్స్ (Palo Alto Networks) $4.5 బిలియన్లకు కొనుగోలు చేసేందుకు తుది ఒప్పందం కుదుర్చుకుంది.
స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయం నుంచి ఓపెన్ఏఐ (OpenAI)లో చేరిన యశ్ పాటిల్, 2025 మే వరకు అక్కడ కోడెక్స్ AI విభాగంలో పనిచేశారు. అనంతరం రిథమ్, లిండెన్లతో కలిసి అప్లైడ్ కంప్యూట్‌ను స్థాపించారు. ప్రారంభమైన 18 నెలల్లోనే ఈ సంస్థ నవంబర్ 2026 నాటికి $100 మిలియన్ల వార్షిక ఆదాయ రన్-రేట్‌ను దాటింది.
మైక్రోసాఫ్ట్, ఎన్విడియా, డోర్‌డాష్, షాపిఫై వంటి దిగ్గజ సంస్థలు అప్లైడ్ కంప్యూట్ కస్టమర్లుగా ఉన్నాయి. ఈ నెల ప్రారంభంలోనే $350 మిలియన్ల నిధులు సమీకరించినప్పుడు సంస్థ విలువ $3.25 బిలియన్లుగా నమోదైంది.
నియంత్రణ సంస్థల అనుమతుల అనంతరం 2027 ఏప్రిల్ 30తో ముగిసే పాలో ఆల్టో నెట్వర్క్స్ మూడో త్రైమాసికంలో ఈ లావాదేవీ పూర్తికానుంది. ఒప్పందం తర్వాత యశ్ పాటిల్ పాలో ఆల్టో నెట్వర్క్స్ కో-చీఫ్ AI ఆఫీసర్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు.




