వాషింగ్టన్: అమెరికాలో శాశ్వత నివాస హోదా (గ్రీన్ కార్డ్) కోసం ఎదురుచూస్తున్న భారతీయ, ప్రవాసాంధ్ర నిపుణులకు USCIS కీలక అప్‌డేట్ ఇచ్చింది. నవంబర్ 27న విడుదల చేసిన తాజా సూచనల ప్రకారం, డిసెంబర్ 2026 నెలలోనూ Adjustment of Status (ఫారం I-485) దరఖాస్తుల కోసం 'డేట్స్ ఫర్ ఫైలింగ్' చార్ట్ అమల్లో ఉంటుంది.
ఉపాధి ఆధారిత (Employment-Based) విభాగాలతో పాటు కుటుంబ ఆధారిత (Family-Sponsored) విభాగాలన్నింటికీ ఇదే నిబంధన వర్తిస్తుందని USCIS స్పష్టం చేసింది. సాధారణంగా ఫైనల్ యాక్షన్ డేట్స్ కంటే డేట్స్ ఫర్ ఫైలింగ్ ముందుగా ఉండటం వల్ల, ప్రయారిటీ తేదీలు ఆ పరిధిలో ఉన్నవారు ముందే I-485 దరఖాస్తుతో పాటు వర్క్ పర్మిట్ (EAD), ట్రావెల్ డాక్యుమెంట్ పొందే వీలుంటుంది.
అయితే ఒక కేటగిరీకి సంబంధించిన ఫైనల్ యాక్షన్ డేట్ 'కరెంట్'గా ఉన్నా లేదా డేట్స్ ఫర్ ఫైలింగ్ కంటే ముందున్నా, దరఖాస్తుదారులు ఫైనల్ యాక్షన్ డేట్స్ చార్ట్ ద్వారా కూడా ఫైల్ చేయవచ్చని USCIS గుర్తుచేసింది.
నవంబర్ 27 నుంచి ఫారమ్ ఎడిషన్ నిబంధనల్లోనూ కొన్ని మార్పులు అమల్లోకి వచ్చినందున, అభ్యర్థులు దరఖాస్తుకు ముందు USCIS అధికారిక వెబ్‌సైట్‌లో తాజా ఎడిషన్‌ను సరిచూసుకోవాలని సూచించింది.




