జమ్మూలోని గాంధీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్న తెలంగాణకు చెందిన ఓ ఆర్మీ అధికారి భార్యపై జమ్మూకశ్మీర్ పోలీసులు కేసు నమోదు చేశారు. దేశ రహస్యాలను చైనా నిఘా ఏజెంట్లకు చేరవేసినట్లు ఆమెపై ఆరోపణలు ఉన్నాయి.

ఓ సీనియర్ ఆర్మీ అధికారి భార్య విదేశీ నిఘా సంస్థలకు చెందిన వ్యక్తులతో సంబంధాలు కొనసాగిస్తూ వ్యూహాత్మక ప్రాధాన్యం ఉన్న సమాచారాన్ని చేరవేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఆరోపణలపై దర్యాప్తు జరుగుతోంది.

ఈ ఆరోపణలు దేశ భద్రత వర్గాలలో ఆందోళన కలిగిస్తున్నాయి. కీలకమైన సమాచారం లీక్ అయిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

నిందితురాలు ప్రస్తుతం జమ్మూలో నివాసం ఉంటున్నారని పోలీసులు పేర్కొన్నారు. ఈ కేసులో తదుపరి చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.