బాపట్ల జిల్లా ఎస్పీ బి. ఉమామహేశ్వర్ సోమవారం పోలీస్ వెల్ఫేర్ డే కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా ఎస్పీ క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో మరణించిన పోలీసు ఉద్యోగుల కుటుంబ సభ్యులతో ఆయన మాట్లాడారు.

పోలీస్ శాఖలో విధులు నిర్వహిస్తూ వివిధ కారణాలతో మరణించిన పోలీసు ఉద్యోగుల కుటుంబాలకు అండగా ఉంటామని ఎస్పీ హామీ ఇచ్చారు. వారి సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు.

ఈ సందర్భంగా ఎస్పీ ప్రతి కుటుంబ సభ్యుడితో ప్రత్యేకంగా మాట్లాడారు. వారి వ్యక్తిగత సమస్యలు, ప్రభుత్వం నుంచి ఇంకా అందాల్సిన బకాయిల గురించి అడిగి తెలుసుకున్నారు.

ప్రభుత్వం నుంచి అందాల్సిన భద్రత, జీపీఎఫ్, ఏపీజీఎల్‌ఐ, చేయూత, విడో ఫండ్, కార్పస్ ఫండ్, అడిషనల్ కార్పస్ ఫండ్, గ్రూప్ ఇన్సూరెన్స్ స్కీమ్ వంటి ఆర్థిక ప్రయోజనాలు సకాలంలో అందాయా లేదా అని ఎస్పీ ఆరా తీశారు.

లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ వంటి ఇతర సంక్షేమ ప్రయోజనాల గురించి కూడా ఆయన వివరాలు అడిగారు. పోలీసు కుటుంబాలకు అన్ని విధాలా అండగా ఉంటామని ఎస్పీ పునరుద్ఘాటించారు.