ప్రైవేట్ టెలికాం దిగ్గజాలు ఇటీవల రీచార్జ్ ధరలను భారీగా పెంచడంతో సామాన్య వినియోగదారులు ప్రత్యామ్నాయాల వైపు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో, బీఎస్ఎన్ఎల్ తన ‘ఫ్రీడమ్ 2.0’ ఆఫర్ గడువును నవంబర్ 9 వరకు పొడిగించింది. ఈ ఆఫర్ ప్రైవేట్ కంపెనీల టారిఫ్ వాతకు కౌంటర్‌గా నిలుస్తుందని భావిస్తున్నారు. వినియోగదారులకు ఇది ఒక మంచి అవకాశంగా మారింది.
ఈ ‘ఫ్రీడమ్ 2.0’ ఆఫర్ కింద వినియోగదారులు కేవలం రూపాయికే రీచార్జ్ చేసుకోవచ్చు. దీంతో పాటు ఉచిత సిమ్ కార్డు, 24 రోజుల పాటు అన్లిమిటెడ్ కాల్స్, రోజుకు 1GB డేటా వంటి ప్రయోజనాలు లభిస్తాయి. బీఎస్ఎన్ఎల్ ఈ సరికొత్త సంచలన ప్లాన్‌తో ప్రైవేట్ టెలికాం కంపెనీలకు గట్టి పోటీ ఇస్తోంది. నవంబర్ 9 వరకు ఈ ఆఫర్‌ను సద్వినియోగం చేసుకోవాలని బీఎస్ఎన్ఎల్ కోరింది.