
సత్యసాయి జిల్లాలో బీఈఎల్ ₹2,500 కోట్ల రక్షణ రంగ పెట్టుబడి: 914 ఎకరాల్లో యూనిట్, 800 ఉద్యోగాలు అంటున్న లోకేశ్
కేంద్ర ప్రభుత్వ నవరత్న సంస్థ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బీఈఎల్) శ్రీ సత్యసాయి జిల్లాలో 914 ఎకరాల్లో ₹2,500 కోట్లతో రక్షణ తయారీ వ్యవస్థను ఏర్పాటు చేయనుందని మంత్రి నారా లోకేశ్ ప్రకటించారు. దీంతో సుమారు 800 ఉద్యోగాలు వస్తాయని, రాయలసీమలో అనుబంధ పరిశ్రమలు పెరుగుతాయని ఆయన చెప్పారు.