హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (RGIA) అధికారిక ఎక్స్ (X) ఖాతా ఇవాళ ఉదయం 11 గంటల ప్రాంతంలో హ్యాక్ అయింది.
ఈ సైబర్ సెక్యూరిటీ ముప్పును ఎయిర్పోర్ట్ అధికారులు గుర్తించారు. వెంటనే అప్రమత్తమయ్యారు.
విమానాశ్రయం ఐటీ బృందం తక్షణ చర్యలు చేపట్టింది. ఖాతాను పునరుద్ధరించడానికి తీవ్రంగా శ్రమించింది.
తీవ్ర ప్రయత్నాల తర్వాత, హ్యాక్ అయిన ఖాతాను ఎట్టకేలకు రికవరీ చేయగలిగారు. ప్రస్తుతం ఖాతా సాధారణ స్థితికి చేరుకుంది.