విశాఖపట్నంలో గూగుల్-అదానీ సంస్థలు సంయుక్తంగా ఏర్పాటు చేస్తున్న డేటా సెంటర్లపై ఇటీవల పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఈ ప్రాజెక్టుల వల్ల పర్యావరణానికి నష్టం వాటిల్లుతుందని, నీటి వినియోగం అధికంగా ఉంటుందని ఆందోళనలు వ్యక్తమయ్యాయి.
ఈ ఆందోళనలు, న్యాయస్థానాల్లో దాఖలైన పిటిషన్ల నేపథ్యంలో గూగుల్-అదానీ సంస్థలు ఈ ప్రాజెక్టులపై స్పష్టత ఇచ్చాయి. డేటా సెంటర్ల నిర్మాణం, నిర్వహణకు సంబంధించి వివరాలను వెల్లడించాయి.
డేటా సెంటర్లలో నీటి వినియోగాన్ని తగ్గించేందుకు అత్యాధునిక ఎయిర్ కూల్డ్ టెక్నాలజీని ఉపయోగించనున్నట్లు సంస్థలు తెలిపాయి. దీనివల్ల పర్యావరణంపై ప్రభావం తగ్గుతుందని పేర్కొన్నాయి.
సోషల్ మీడియా వేదికగా పర్యావరణవేత్తలు డేటా సెంటర్ల వల్ల నీటి వినియోగం ఎక్కువగా ఉంటుందని, పర్యావరణానికి డ్యామేజ్ జరుగుతుందని, జంతువులకు ఇబ్బందులు ఉంటాయని గొంతుఎత్తారు.
ఈ ప్రాజెక్టులపై బెంగళూరు నుంచి ప్రత్యేకంగా జర్నలిస్టులను తీసుకొచ్చి కథనాలు ప్రచురించారు. అంతర్జాతీయ మీడియాను కూడా విశాఖకు తీసుకొచ్చి కథనాలు చేయించారు.
అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పర్యావరణ హితంగా డేటా సెంటర్లను నిర్మిస్తామని గూగుల్-అదానీ సంస్థలు హామీ ఇచ్చాయి. భవిష్యత్తులో ఇలాంటి ఆందోళనలు తలెత్తకుండా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నాయి.