హైదరాబాద్‌లోని జేఎన్‌టీయూ క్యాంపస్‌లో భూగర్భ జలాలను పెంచడానికి రివర్స్ బోర్‌వెల్స్ అనే ఆధునిక సాంకేతిక విధానాన్ని ఉపయోగిస్తున్నారు. వర్షపు నీటిని నిల్వ చేసి, దానిని భూమిలోకి పంపడం ద్వారా ఈ ప్రక్రియ జరుగుతుంది.

సాధారణంగా హైదరాబాద్ నగరంలో వేసవిలో భూగర్భ జలాలు అడుగంటిపోతుంటాయి. ట్యాంకర్ల కోసం ప్రజలు ఎదురుచూడాల్సి వస్తుంది.

అయితే జేఎన్‌టీయూ క్యాంపస్‌లో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. ఎల్‌నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితులు ఉన్నప్పటికీ ఇక్కడ భూగర్భ జలాలు సమృద్ధిగా ఉంటున్నాయి.

ఈ వర్సిటీ అనుసరిస్తున్న వినూత్న వర్షపు నీటి సంరక్షణ విధానమే దీనికి కారణం. రివర్స్ బోర్‌వెల్స్ ద్వారా వర్షపు నీటిని సమర్థవంతంగా భూమిలోకి పంపిస్తున్నారు.