నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ వద్ద ఈరోజు ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అమల ట్రావెల్స్, మహేశ్వరి ట్రావెల్స్ బస్సులు ఒకదానినొకటి ఢీకొనడంతో ఈ ఘటన చోటుచేసుకుంది.
ఈ ప్రమాదంలో బస్సుల్లో ఉన్న ప్రయాణికులందరూ తృటిలో పెను ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు. దీంతో అధికారులు, ప్రయాణికుల కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు.
పొద్దుటూరు నుంచి హైదరాబాద్ వైపు 20 మంది ప్రయాణికులతో అమల ట్రావెల్స్ బస్సు వెళ్తోంది. అదే సమయంలో, బద్వేల్ నుంచి హైదరాబాద్ మార్గంలో 27 మంది ప్రయాణికులతో మహేశ్వరి ట్రావెల్స్ బస్సు పయనిస్తోంది.
అమల ట్రావెల్స్ బస్సు మహేశ్వరి ట్రావెల్స్ బస్సును ఓవర్ టెక్ చేసేందుకు ప్రయత్నించగా ఈ ప్రమాదం జరిగింది. ఓవర్‌టేక్ చేయబోయి నియంత్రణ కోల్పోవడంతో రెండు బస్సులు ఢీకొన్నాయి.