మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పోలీసులు వాహనాల తనిఖీలను విస్తృతం చేశారు. ఆదివారం పురుషోత్తపురం జాతీయ రహదారిపై ఏర్పాటు చేసిన చెక్‌పోస్టు వద్ద ఒడిశా నుంచి ఆంధ్రప్రదేశ్‌లోకి వస్తున్న ప్రతి వాహనాన్ని తనిఖీ చేశారు.
ఈ తనిఖీలలో భాగంగా భువనేశ్వర్ నుంచి పలాస వైపు వెళ్తున్న కారును ఆపి పరిశీలించగా, అందులో రూ.4 లక్షల నగదు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
నగదుకు సంబంధించి సరైన పత్రాలు చూపించకపోవడంతో పోలీసులు ఆ మొత్తాన్ని సీజ్ చేశారు. కారులోని వ్యక్తులను ప్రశ్నించగా, జీడిపప్పు వ్యాపారం నిమిత్తం పలాస వెళ్తున్నామని తెలిపారు.
అయితే, నగదుకు సంబంధించిన ఆధారాలు లేకపోవడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఎన్నికల సమయంలో అక్రమ నగదు రవాణాను అరికట్టడమే లక్ష్యంగా ఈ తనిఖీలు జరుగుతున్నాయి.