ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంతర్జాతీయ స్థాయిలో గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లు ఉండాలని అధికారులను ఆదేశించారు. నవంబర్ నెలాఖరులోగా ఈ ఏర్పాట్లను పూర్తి చేయాలని ఆయన స్పష్టం చేశారు.
సోమవారం ముఖ్యమంత్రి భారత్ ఫ్యూచర్ సిటీలో పర్యటించారు. ఈ సందర్భంగా యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు.
యూనివర్సిటీ నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు. వీలైనంత త్వరగా పనులు పూర్తయ్యేలా చూడాలని ఆదేశించారు.
నిర్దేశిత గడువుకు పదిహేను రోజుల ముందుగానే పనులు పూర్తి చేయాలని ముఖ్యమంత్రి తెలిపారు. అవసరమైతే సిబ్బంది సంఖ్యను పెంచాలని ఆయన సూచించారు.