సైబరాబాద్ పోలీసులు రోడ్డు ప్రమాదానికి గురైన బాధితులతో వింతగా ప్రవర్తించారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదును స్వీకరించడానికి పోలీసులు నిరాకరించారు, ఈ ఘటన సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.
పోలీసులు బాధితులతో మాట్లాడుతూ, "మీరు రెండు పెన్‌లతో ఫిర్యాదు రాశారు, మేము కంప్లైంట్ తీసుకోం" అని స్పష్టం చేశారు. ఈ విచిత్రమైన కారణంపై పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
యాక్సిడెంట్, దొంగతనాలు, సీనియర్ సిటిజన్‌లకు సంబంధించిన సంఘటనల్లో స్పాట్‌లోనే ఫిర్యాదును తీసుకుని గంట నుంచి 24 గంటలలోపు ఎఫ్ఐఆర్ కాపీని ఫోన్‌కు పంపిస్తామని ఉన్నతాధికారులు గతంలో తెలిపారు.
అయితే, క్షేత్రస్థాయిలో సిబ్బంది మాత్రం ఉన్నతాధికారుల ఆదేశాలకు భిన్నంగా ప్రవర్తిస్తున్నారు. ఎఫ్ఐఆర్ కోసం పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగాల్సిన అవసరం లేదని ఉన్నతాధికారులు చెప్పినా, సిబ్బంది తీరు మారడం లేదు.