పిట్లం మండలం అన్నారం తండాలో దసరా పండుగ సందర్భంగా వండిన మేక మాంసం తిని 18 మంది అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన అక్టోబర్ 19న జరిగింది.

అన్నారం తండాకు చెందిన మెగావత్ శంకర్ ఇంట్లో దసరా పండుగ విందు ఏర్పాటు చేశారు. నిన్న మేకను కోసి మాంసాన్ని సిద్ధం చేశారు.

ఈ రోజు ఉదయం ఆ మాంసాన్ని వండి బంధువులతో కలిసి తిన్నారు. మాంసం తిన్న కొద్దిసేపటికే వారికి అస్వస్థత మొదలైంది.

ఫుడ్ పాయిజన్ కారణంగానే ఈ ఘటన జరిగిందని స్థానికులు తెలిపారు. అస్వస్థతకు గురైన వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.