దీపావళి పండుగ రోజైన ఆదివారం (నవంబర్ 8) తిరుమల శ్రీవారి ఆలయంలో దీపావళి ఆస్థానం నిర్వహిస్తామని టీటీడీ ప్రకటించింది. ఉదయం 7 నుంచి 9 గంటల వరకు బంగారు వాకిలి ముందున్న ఘంటా మండపంలో ఈ కార్యక్రమం జరుగుతుంది.
ఆస్థానం ఇలా
- శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామి సర్వభూపాల వాహనంపై గరుడాళ్వార్‌కు అభిముఖంగా కొలువుదీరుతారు.
- స్వామివారికి ఎడమవైపు మరో పీఠంపై శ్రీ విష్వక్సేనులవారిని దక్షిణాభిముఖంగా వేంచేపు చేస్తారు.
- అర్చకులు ప్రత్యేక పూజ, హారతి, నివేదన చేయడంతో ఆస్థానం ముగుస్తుంది.
- సాయంత్రం 5 గంటలకు శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామికి సహస్ర దీపాలంకార సేవ, ఆ తర్వాత నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపు.
సేవల రద్దు
ఆస్థానం కారణంగా ఆ రోజు కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవాన్ని రద్దు చేశారు. తోమాల, అర్చన సేవలను ఏకాంతంగా నిర్వహిస్తారు. భక్తులు ఈ విషయాన్ని గమనించి ప్రయాణం ప్లాన్ చేసుకోవాలని టీటీడీ కోరింది.



