తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)కి కల్తీ నెయ్యి సరఫరా చేసిన కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తు చేపట్టింది. ఈ కేసులో సుకృతి ఫుడ్స్ ప్రమోటర్ కైలాష్ చంద్ మంగ్లాను ఈడీ అరెస్టు చేసింది. అసలు ఆవు నెయ్యి వాడకుండా, పామాయిల్ రసాయనాలు కలిపి అగ్మార్క్ పేరుతో స్వామివారికి సరఫరా చేసినట్లు ఈడీ దర్యాప్తులో వెల్లడైంది. ఈ కల్తీ రాకెట్లో భోలే బాబా డెయిరీ డైరెక్టర్ విపిన్ జైన్‌కు కూడా ప్రమేయం ఉన్నట్లు ఈడీ అధికారులు గుర్తించారు.
ఈడీ దర్యాప్తులో వెల్లడైన వివరాల ప్రకారం, సుకృతి ఫుడ్స్ సంస్థ టీటీడీకి సరఫరా చేసిన నెయ్యిలో ఆవు నెయ్యి లేదని, దానికి బదులుగా పామాయిల్ ఇతర రసాయనాలను కలిపి అగ్మార్క్ ముద్రతో విక్రయించినట్లు తేలింది. ఈ కల్తీ వ్యవహారంలో భోలే బాబా డెయిరీ డైరెక్టర్ విపిన్ జైన్ పాత్రపై కూడా ఈడీ దృష్టి సారించింది. ఈ కేసులో విపిన్ జైన్ కూడా ఊచలు లెక్కపెట్టాల్సి వస్తుందని అధికారులు తెలిపారు.