హైదరాబాద్లోని మాదాపూర్లో ఉన్న యూనిస్ట్రింగ్ టెక్ సొల్యూషన్స్ సాఫ్ట్వేర్ కంపెనీలో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనతో ఉద్యోగులు భయాందోళనకు గురై బయటకు పరుగులు తీశారు. యూనిస్ట్రింగ్ టెక్ సొల్యూషన్స్ సంస్థలోని యాంటీ డ్రోన్ సిస్టమ్స్ తయారీకి సంబంధించిన గోదాములో మంటలు వ్యాపించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు.
ప్రాథమిక అంచనా ప్రకారం, విద్యుదాఘాతం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. అగ్నిప్రమాదం కారణంగా ఆ ప్రాంతంలో దట్టమైన పొగ కమ్ముకుంది. అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు ముమ్మరం చేశారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని అధికారులు తెలిపారు. ఆస్తి నష్టం అంచనా వేస్తున్నారు.