గ్రేటర్ నోయిడాలోని రబూపురా ప్రాంతం నగ్లా శ్రీ పదమ్ గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు శనివారం ఉదయం మృతిచెందారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. మృతులలో మహేశ్ (37), ఆయన భార్య లలిత (35), వారి పిల్లలు లడ్డూ (11), మిష్టి (7), సాక్షత్ (3) ఉన్నారు. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
కుటుంబ సభ్యుల మృతికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఒకేసారి ఐదుగురు మృతి చెందడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.