స్టేషన్ బెయిలు ఇచ్చేందుకు రూ.5 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన కీసర పూర్వ ఇన్‌స్పెక్టర్ అరకపల్లి ఆంజనేయులు భారీగా అక్రమాస్తులు కూడబెట్టినట్లు వెల్లడైంది.

ఏసీబీ అధికారులు జరిపిన దర్యాప్తులో ఇళ్లు, స్థలాలు, బంగారం కలిపి మొత్తం రూ.2.28 కోట్ల విలువైన ఆస్తులను ఆయన కలిగి ఉన్నట్లు గుర్తించారు.

ఈ ఆస్తుల మార్కెట్ విలువ రూ.20 కోట్లకుపైగా ఉండవచ్చని ఏసీబీ అంచనా వేసింది.

అక్రమంగా కూడబెట్టిన ఈ ఆస్తులపై ఏసీబీ కేసు నమోదు చేసింది.