డీఎస్సీ-2008 ఎస్జీటీ ఉపాధ్యాయ నియామకాల్లో డీఎడ్ అర్హత ఉన్న అభ్యర్థులకు 30% పోస్టులు కేటాయించడం సరైనదేనని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు జీవో 28ని సమర్థిస్తూ ధర్మాసనం తీర్పు వెలువరించింది.
తాతాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ పీ శ్యాం కోశీ, జస్టిస్ సుద్దాల చలపతిరావు ధర్మాసనం ఈ కేసును విచారించింది. అక్టోబర్ 17న ఈ తీర్పు వెలువడింది.
2008లో ఎస్జీటీ, స్కూల్ అసిస్టెంట్ వంటి 52,665 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయింది. ఎస్జీటీ పోస్టుల్లో డీఎడ్ అభ్యర్థులకు 30% కేటాయించడాన్ని సవాలు చేస్తూ 2009లో హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి.
నోటిఫికేషన్ విడుదలైన తర్వాత నిబంధనలను మార్చడం సరికాదని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు వాదించారు. ఇది ఆట ప్రారంభమయ్యాక నియమాలు మార్చినట్లు అవుతుందని వారు పేర్కొన్నారు.