విశాఖపట్నంలోని హోమీ భాభా క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్ (HBCHRC) ఒక క్లినికల్ ట్రయల్ కోఆర్డినేటర్ పోస్టును భర్తీ చేయడానికి వాక్-ఇన్ ఇంటర్వ్యూ నిర్వహిస్తోంది. ఈ పోస్టుకు అర్హులైన అభ్యర్థులు అక్టోబర్ 21, 2026న ఇంటర్వ్యూకు హాజరుకావచ్చు.
ఈ పోస్టుకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు డి.ఫార్మ్, ఎం.ఫార్మా, ఎం.ఎస్సీ లేదా పీజీ డిప్లొమా ఇన్ క్లినికల్ రీసెర్చ్ పూర్తి చేసి ఉండాలి. లైఫ్ సైన్సెస్, బయోటెక్, జువాలజీ, బోటనీ వంటి విభాగాల్లో పీజీ డిగ్రీతో పాటు క్లినికల్ రీసెర్చ్‌లో పీజీ డిప్లొమా తప్పనిసరి.
క్లినికల్ రీసెర్చ్‌లో ఒక సంవత్సరం అనుభవం ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది. ఈ పోస్టుకు ఎంపికైన వారికి నెలకు రూ.27,000 నుండి రూ.30,000 వరకు జీతం చెల్లిస్తారు.
ఆసక్తి గల అభ్యర్థులు అక్టోబర్ 21, 2026న ఉదయం 09:30 నుండి 10:30 గంటల మధ్య రిపోర్టింగ్ చేయాలి. ఇంటర్వ్యూ హోమీ భాభా క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్, అగనంపూడి, విశాఖపట్నం-530053 చిరునామాలో జరుగుతుంది.
