పియర్ల్యాండ్ (టెక్సస్): హ్యూస్టన్ ప్రాంతంలోని ప్రవాసాంధ్రులు, భారతీయ భక్తుల కోసం పియర్ల్యాండ్ శ్రీ మీనాక్షి ఆలయం అయ్యప్ప మండల పూజలకు సిద్ధమైంది. నవంబర్ 16 నుంచి డిసెంబర్ 26 వరకు 41 రోజుల పాటు పూజలు జరుగుతాయని ఆలయ నిర్వాహకులు ప్రకటించారు. ఆదివారం ఉదయం 10 గంటలకు సప్త శుద్ధి అభిషేకంతో ఏర్పాట్లు మొదలయ్యాయి.
పూజల వివరాలు
- రోజూ ఉదయం 9 నుంచి రాత్రి 8:30 వరకు అభిషేకం, ఉష పూజ, దీపారాధన, సహస్రనామార్చన, హరివరాసనం
- అష్టాభిషేకం (ఉదయం 10 గంటలకు): నవంబర్ 21, 28; డిసెంబర్ 5, 12, 19, 26
- నవంబర్ 28న ఉదయం 8:30 నుంచి రాత్రి 8:30 వరకు అఖండ నామజపం, అన్నదానం
- డిసెంబర్ 26 ముగింపు రోజు: ఉదయం 9 గంటలకు నెయ్యాభిషేకం, సాయంత్రం 5 గంటలకు ఆభరణ ఊరేగింపు, రాత్రి హరివరాసనంతో మండల పూజలు సమాప్తం
- స్పాన్సర్షిప్: 41 రోజులకు 1,001 డాలర్లు, నిత్య పూజకు 251 డాలర్లు, అన్నదానానికి 75 డాలర్లు
ఇదే ఆలయంలో నవంబర్ 9న మొదలైన స్కంద షష్ఠి ఉత్సవాలు శనివారం ముగిశాయి. చివరి రోజు స్కంద హోమం, సూర సంహారం, ప్రాయశ్చిత్త అభిషేకం, సుబ్రహ్మణ్య స్వామి తిరుకల్యాణం నిర్వహించి మహా హారతి, ప్రసాద వితరణతో ఉత్సవాలను ముగించారు.
ఆలయ చైర్మన్ కుమార్ భాష్యం, కార్యదర్శి విజయరాణి చిలుకూరి, కోశాధికారి సేతురామన్ రామన్ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.




