మదనపల్లె పట్టణంలోని బిసెంట్ రోడ్డులో ఉన్న రాజ్ భవన్ లాడ్జిలో ఈ నెల 15న జరిగిన మహిళ హత్య కేసులో నిందితుడు నవీద్ పాషాను వన్‌టౌన్ పోలీసులు శనివారం అరెస్టు చేశారు.
అరెస్టు చేసిన అనంతరం నిందితుడిని రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసు వివరాలను వన్‌టౌన్ సీఐ మోహన్ కుమార్ వెల్లడించారు.
రాజ్ భవన్ లాడ్జిలో రుబియా తాజ్‌ను హత్య చేసిన కేసులో ఆమె భర్త నవీద్ పాషా అలియాస్ గంజా నవీద్ (30) నిందితుడిగా ఉన్నాడు.
పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ హత్యకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామని సీఐ తెలిపారు.