హైదరాబాద్‌లో మరో కొత్త రకం సైబర్ స్కామ్ వెలుగు చూసింది. కంపెనీ సీఈఓను అని చెబుతూ భాగ్యనగరంలో ఏకంగా ఓ సూపర్ మార్కెట్‌ను మోసం చేశాడు ఒక సైబర్ నేరగాడు. సీఈఓ పేరుతో ఏకంగా రూ. 2.7 కోట్లు కొట్టేశాడు. ఈ ఘటనపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. 36 ఏళ్ల ఓ బిజినెస్ మ్యాన్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.