న్యూయార్క్ / హైదరాబాద్: అమెరికాలో పనిచేస్తున్న ప్రవాసాంధ్ర, భారతీయ ఐటీ నిపుణులకు ఐబీఎం (IBM) కీలక షాక్ ఇచ్చింది. ప్రపంచవ్యాప్తంగా 1.50 లక్షల మందికి పైగా ఉద్యోగులు ఉన్న తన కన్సల్టింగ్ విభాగంలోని మెజారిటీ అమెరికా ఉద్యోగాలకు H-1B వీసా, గ్రీన్‌కార్డు స్పాన్సర్‌షిప్‌ను నిలిపివేసింది.
అయితే ఇది ఐబీఎం ఇతర విభాగాలకు వర్తించదని సంస్థ స్పష్టం చేసింది. ప్రభావితమైన అమెరికా ఉద్యోగులు భారత్ వంటి ఇతర దేశాలకు బదిలీ అయ్యేందుకు మూడు వారాల గడువు ఇచ్చారు. బదిలీకి అంగీకరించని వారికి 2026 డిసెంబర్ 31 చివరి పని దినమని, మూడు నెలల వేతన పరిహారం (సీవరెన్స్) ఇస్తామని తెలిపింది.
ఎంతమంది ఉద్యోగులపై ప్రభావం పడుతుందో ఐబీఎం వెల్లడించలేదు. నవంబర్ 19 నాటికి ఐబీఎం కెరీర్స్ పోర్టల్‌లో అమెరికా వెలుపల 1,278 కన్సల్టింగ్ పోస్టులు ఖాళీగా ఉండగా, వాటిలో 1,125 భారత్‌లోనే ఉన్నాయి. అమెరికా నుంచి భారత్‌కు మారితే వేతనంలో 80 శాతం వరకు కోత పడవచ్చని ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మొత్తం H-1B ఆమోదాల్లో భారతీయుల వాటా 69.9 శాతం (సుమారు 2.83 లక్షల మంది) ఉంది. FY2024లో 3,99,402గా ఉన్న అమెరికా H-1B ఆమోదాలు FY2025లో 3,28,185కు తగ్గాయి.




