కాలిఫోర్నియాలో తన భార్యను US ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ (ICE) ఏజెంట్లు తీసుకెళ్లారని చెప్పిన భారత సంతతి వ్యక్తిని ఆమె హత్య కేసులో అరెస్టు చేశారు. ఆమె కాలిపోయిన అవశేషాలు లభించిన తర్వాత అధికారులు ఈ చర్య తీసుకున్నారు.

గురీందర్ సింగ్ గిల్ (28) అనే వ్యక్తిని బుధవారం అరెస్టు చేశారు. ఎల్ డొరాడో కౌంటీ, కాలిఫోర్నియాలో లభించిన అవశేషాలు అతని భార్య జాస్మిన్ గిల్ (30)విగా గుర్తించారు.

జాస్మిన్ గిల్ చివరిసారిగా సెప్టెంబర్ 30న శాక్రమెంటోలోని తన ఇంట్లో కనిపించారు. ఆమె కనిపించడం లేదని అక్టోబర్ 4న ఆమె బంధువు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

శాక్రమెంటో కౌంటీ షెరీఫ్ కార్యాలయం విడుదల చేసిన పత్రికా ప్రకటనలో ఈ వివరాలు వెల్లడయ్యాయి. దంపతులు విడాకుల ప్రక్రియలో ఉన్నారని, పిల్లల కస్టడీకి సంబంధించిన వివాదం కూడా నడుస్తోందని షెరీఫ్ కార్యాలయం పేర్కొంది.

గురీందర్ సింగ్ గిల్‌ను శాక్రమెంటో కౌంటీ మెయిన్ జైలులో ఉంచారు. ప్రస్తుతం అతనికి బెయిల్ లభించే అవకాశం లేదని అధికారులు తెలిపారు.