పెర్త్: ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయ సంతతి నాయకులను అనుసంధానించే ‘ఇండియాస్పోరా’ (Indiaspora) సంస్థ పశ్చిమ ఆస్ట్రేలియా రాజధాని పెర్త్‌లో తన తొలి అధికారిక సమావేశాన్ని నిర్వహించింది. నవంబర్ 16న జరిగిన ఈ కార్యక్రమంలో ఆస్ట్రేలియా కంట్రీ హెడ్ జై పటేల్‌తో పాటు వివిధ రంగాలకు చెందిన ప్రవాస భారతీయ ప్రముఖులు పాల్గొన్నారు.
మెల్బోర్న్, సిడ్నీ నగరాల తర్వాత పశ్చిమ ఆస్ట్రేలియాలో వేగంగా పెరుగుతున్న భారతీయ, తెలుగు సంతతి నిపుణుల సమూహాన్ని దృష్టిలో ఉంచుకుని పెర్త్‌లో ఈ వేదికను ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. మైనింగ్, ఇంధనం, ఐటీ, వైద్య రంగాల్లో పనిచేస్తున్న ప్రవాసులు ఈ భేటీకి హాజరయ్యారు.
దాతృత్వ కార్యక్రమాలు, వాణిజ్య పెట్టుబడులు, విద్యా భాగస్వామ్యాల ద్వారా భారత్–ఆస్ట్రేలియా సంబంధాలను మరింత ముందుకు తీసుకెళ్లే మార్గాలపై ఈ సదస్సులో చర్చించారు.
రాబోయే ఏడాదిలో పశ్చిమ ఆస్ట్రేలియాలో ప్రవాస భారతీయ యువ పారిశ్రామికవేత్తలు, నిపుణుల కోసం మరిన్ని నెట్వర్కింగ్, సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఇండియాస్పోరా ప్రతినిధులు వెల్లడించారు.




