హైదరాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ పోలీస్ అకాడమీ (ఎస్వీపీఎన్‌పీఏ)లో 78వ బ్యాచ్ ఐపీఎస్ ప్రొబేషనర్లు తమ ప్రాథమిక శిక్షణలో మొదటి దశను పూర్తి చేసుకున్నారు. ఈ శిక్షణ ముగింపును సూచిస్తూ శనివారం దీక్షాంత్ పరేడ్ నిర్వహించారు.

ఈ బ్యాచ్‌లో మొత్తం 151 మంది ఆఫీసర్ ట్రైనీలు ఉన్నారు. వీరిలో 135 మంది ఐపీఎస్ ప్రొబేషనర్లు కాగా, 16 మంది విదేశీ అధికారులు ఉన్నారు.

నేపాల్, భూటాన్, మాల్దీవుల నుండి వచ్చిన విదేశీ ఆఫీసర్ ట్రైనీలు కూడా ఈ శిక్షణలో భాగమయ్యారు. శిక్షణ పొందిన వారిలో 37 మంది మహిళా అధికారులు ఉన్నారు.

కేంద్ర హోం కార్యదర్శి గోవింద్ మోహన్ ఈ దీక్షాంత్ పరేడ్‌కు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన పరేడ్‌ను పరిశీలించారు.